పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్.. క్లారిటీ ఇచ్చినట్లేనా!!

పవన్ కళ్యాణ్ హీరో గా గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా రూపొందవలసి ఉంది. అయితే సినిమా ప్రకటించి చాలా రోజులే అవుతున్నా ఈ సినిమా ఇంకా మొదలు కాలేదు. ‘ఈసారి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు’ అంటూ కాన్సెప్ట్ పోస్టర్ తో సినిమాపై ఆసక్తిని కలిగించారు. అయితే ఎన్నో అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా క్యాన్సల అయ్యిందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని.. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని నిర్మాతలు గతేడాది సెప్టెంబర్ లో వెల్లడించారు.

‘భీమ్లా నాయక్’ చివరి దశలో ఉండగా.. ‘హరి హర వీరమల్లు’ చిత్ర షూటింగ్ తిరిగి సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సినిమా మొదలవుతుందని.. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. అయితే ఇది జరిగి ఏడాది గడిచినా.. ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ప్రస్తుత ఈ సినిమా పూర్తిగా ఆగిపోయిదని అంటున్నారు. హరీష్ శంకర్ త్వరలోనే తన సినిమా ను వేరే హీరో తో చేయవుతున్నాడు అని అంటున్నారు. గద్దల కొండ గణేష్’ తర్వాత మరో సినిమా చేయకుండా.. పవన్ కళ్యాణ్ కోసం వేచి చూస్తున్నాడు. ఇప్పుడు అయన వెంటనే సినిమా మొదలు పెడతాడా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *