కేజీఎఫ్ స్టార్ యష్ సినిమా కు కొత్త సినిమా కష్టాలు!!

కేజీఎఫ్ రెండు పార్ట్ ల సినిమాలు ఎంత పెద్ద విజయాలను అందుకున్నాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అంతటి భారీ విజయం సాధించిన సినిమాలకు హీరో లుగా నటించిన యష్ కి భారీ స్థాయి లో గుర్తింపు వచ్చింది. అయితే ఈ రెండు సినిమాలు పూర్తయ్యి చాలా రోజులే అవుతున్న కేజీఎఫ్ హీరో తదుపరి సినిమా ను మాత్రం మొదలు పెట్ట లేకపోతున్నాడు. కేజీఎఫ్ -2 తర్వాత యశ్ తో సినిమాలు నిర్మించడానికి…దర్శకత్వం వహించిడానికి అన్ని భాషల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి.

కానీ యశ్ మాత్రం ఇప్పటిదాకా ఏ సినిమా కి ఒకే చేయకపోవడం నిజంగా అందరిని నిరాశపరుస్తుంది. తాజాగా అయన నర్తన్ అనే ఓ దర్శకుడితో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేశాడని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఇంకోవైపు యష్ కు బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయని చెబుతున్నారు.

అయితే రిస్క్ తీసుకుని నార్త్ మేకర్స్ తో సినిమాలు చేయడం కన్నా సౌత్ మేకర్స్ అయితే నే సేఫ్ జోన్ గా ఉంటుందని భావిస్తున్నారుట. అసలే ఇటీవలే కాలంలో నార్త్ దర్శకుల సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం అలరించడం లేదు. అట్లీ..లోకేష కనగరాజ్ లాంటి వారితో సినిమా చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఈ హీరో ఉన్నట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *