ఆర్ ఆర్ ఆర్ సినిమా తో సంచలన విజయాన్ని అందుకుని ప్రస్తుతం జపాన్ లో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్ ని చేస్తుంది చిత్ర బృందం. తారక్, ఎన్టీఆర్ ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనగా వారు దాన్ని ముగించి హైదరాబాద్ లో అడుగుపెట్టారు కూడా. ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలన్నీ పూర్తి కావడంతో తదుపరి తమ ప్రాజెక్టులపై ఆ ఇద్దరూ దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా తారక్ వెంటనే కొరటాలతో సినిమాని చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే మొదలు కావలసిన ఈ సినిమా ఏందో ఆలస్యం అవుతూ వస్తుంది. కొరటాల స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ ను పూర్తి చేసాడని అంటున్నారు.

స్క్రిప్టు అద్భుతంగా వచ్చింది అని అందరు చెబుతున్నారు. నేటి ట్రెండ్ కి తగ్గ స్టోరీ ఇదని గుసగుస వినిపిస్తోంది. అసలే ఫ్లాప్ లో ఉన్న కొరటాల శివ ఈ సినిమా తో కం బ్యాక్ చేస్తారా అనేది చూడాలి. తాజాగా ఈ సినిమా కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియా లో ట్రెండీ అవుతుంది. కొరటాల శివ తో ఎన్టీఆర్ సినిమా చేయడానికి సిద్ధంగా నే ఉన్నా కూడా అది కొరటాల శివ తో ఉండదని చెబుతున్నారు. మరో దర్శకుడితో అయన సినిమా చేయడానికి రెడీ అవుతున్నారట. మరి ఆ దర్శకుడు ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. బుచ్చి బాబు ఈ సినిమా కి దర్శకత్వం వహించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో కొరటాల శివ ఆ తర్వాత చేయనున్నాడన్న మాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *