డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్ 2‘ మరో క్రెడిట్ దక్కించుకుంది. వెబ్ సిరీస్ ల్లో ఇండియాలో టాప్ 3 ప్లేస్ లో ‘సేవ్ ద టైగర్స్ 2‘ నిలిచింది. ఫస్ట్ సీజన్ కు మించిన రెస్పాన్స్ ను ఈ సెకండ్ సీజన్ అందుకుంటోంది. త్వరలోనే సేవ్ ద టైగర్స్ కు థర్డ్ సీజన్ రూపొందించనున్నారు. మూడో సీజన్ కు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

‘సేవ్ ద టైగర్స్ 2‘ సిరీస్ ను మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం క్రియేట్ చేశారు. అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించారు. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, వేణు యెల్దండి, సీరత్ కపూర్, పావని గంగిరెడ్డి, దేవయాని, దర్శన బానిక్, హర్ష వర్థన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫన్ రైడింగ్ వెబ్ సిరీస్ గా ఆకట్టుకుంటోంది సేవ్ ద టైగర్స్ 2.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *