ఇళయరాజా అంటే కమల్ హాసన్ కు విపరీతమైన అభిమానం. కమల్ హాసన్ నటించిన ఎన్నో చిత్రాల్లో మరుపురాని పాటలు అందించాడు ఇళయరాజా. ఒక వేదిక మీద రజనీకాంత్ ఇదే విషయాన్ని చెబుతూ ఇళయరాజా తన కంటే కమల్ హాసన్ కు హిట్ పాటలు చేశాడని అన్నాడు. ఇందుకు ఇళయరాజా మ్యూజిక్ కు హీరోయిజం తెలియదంటూ తన అభిప్రాయం చెప్పాడు. ఇప్పుడు ఇదే అభిమానాన్ని కమల్ హాసన్ ఇళయరాజా మీద చూపించే అవకాశం వచ్చింది.

ఇళయరాజా బయోపిక్ లో ఓ కీ రోల్ లో నటిస్తానని ముందుకొచ్చాడని కమల్ హాసన్. ఈ బయోపిక్ లో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. ఈ చిత్రంలో నటించడం తోపాటు స్క్రీన్ ప్లేలో సహకారం అందించనున్నాడు కమల్ హాసన్. ఇళయరాజా గురించి తనకు తెలిసిన విషయాలు, ఆసక్తికర సంఘటనలు స్క్రీన్ ప్లేలో చేరుస్తున్నాడట. ఇళయరాజా సినిమాను కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ మూవీస్, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ సంస్థలు నిర్మిస్తున్నాయి. దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ రూపొందిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed