ముంబై అంధేరి , భీవండి, జుహూలోని శంకర్‌ ఆలయం పరిసరాల్లో దాదాపు 1000 మంది రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

వేసవి తాపాన్ని తీర్చడానికి దాదాపు తొమ్మిది వేల మందికి మజ్జిగ బాటిల్స్ పంచారు. తమ అభిమాన నటుడు చేసే సేవా కార్యక్రమాలను చూసి స్ఫూర్తి పొందిన అభిమానులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

రామ్‌చరణ్‌ అనగానే సిల్వర్‌స్క్రీన్‌ మీద ఆయన గ్రేస్‌ ఎంత గొప్పగా గుర్తుకొస్తుందో, సొసైటీకి ఆయన చేసే సేవలు కూడా అంతే ఘనంగా మదిలో మెదులుతాయి. ఎన్నో అసోసియేషన్ల ద్వారా, ఎన్జీఓల ద్వారా, చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్ ద్వారా రక్తదానాలు, నేత్రదానాలు, కోవిడ్‌ ఆపత్కాలంలో పలు రకాల సహాయాలు అందిస్తూనే ఉన్నారు. ఆపన్నులను పలు రకాలుగా ఆదుకుంటూనే ఉన్నారు. అవన్నీ ప్రత్యక్షంగా గమనిస్తున్న అభిమానులు సమాజానికి హితోధికంగా సాయపడాలని ముందుకొచ్చారు.

తమ స్టార్‌లాగానే తాము కూడా సమాజం పట్ల బాధ్యతతో ఉండాలని, దయ, కరుణతో వ్యవహరించాలని, నలుగురిలోనూ స్ఫూర్తిపంచాలన్న ధ్యేయంతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఫ్యాన్స్. మజ్జిగ పంచడం అనేది తమకు వచ్చిన ఆలోచనకు ఒక రూపం మాత్రమేనని అన్నారు.

సమాజంలో సాటి వ్యక్తుల పట్ల సానుకూల దృక్పథం పెరగాలంటే, కచ్చితంగా తమవంతు సాయాన్ని ప్రతి ఒక్కరూ చేయాలనే ఉద్దేశాన్ని పంచుకున్నారు.

ఈ నెల 6న ముంబైలోనూ, ఏప్రిల్‌ 29న షోలాపూర్‌లోనూ ఈ మజ్జిక పంపిణీ & అన్నదానం కార్యక్రమాలు జరిగాయి.

మండు వేసవికి మంచితనంతో, మజ్జిగతోనూ చెక్‌ పెడుతున్నారు గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ అభిమానులు .

ఈ బృహత్కార్యాన్ని ఒక్క పదంలో చెప్పమంటే.. హార్ట్ వార్మింగ్‌ అని సవినయంగా చెబుతున్నారు చరణ్‌ సైన్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed