Pushpa

Pushpa: అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఉన్న డైలాగులు చాలా ఫేమస్ అయ్యాయి. మరీ ముఖ్యంగా తగ్గేదేలే అనే డైలాగ్ చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ దాకా బాగా ఫేమస్ అయిపోయింది. ఇక ఈ సినిమాలో వీళ్లు మాట్లాడిన లాంగ్వేజ్ అందరినీ ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ (Allu Arjun) యాస ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసింది.

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కి చిత్తూరు యాస నేర్పించింది చరణ్. చరణ్ (Charan) కి పుష్ప సినిమా మొదటిది. ఇక ఈ సినిమాలో ఈయన నటన కు మెచ్చి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. ఇంతకీ చరణ్ కి ఈ అవకాశం ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. చరణ్ ది ఆంధ్రప్రదేశ్. ఈయన శ్రీకాళహస్తిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆ తర్వాత చిత్తూరు,నెల్లూరు జిల్లాల యాసపై పట్టు సాధించారు.

ఇక ఆ తర్వాత పూణేలోని ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ కొన్ని రోజులు గడిపాడు. కానీ ఈయనకు సినిమాల మీద ఉన్న ఆసక్తితో మళ్లీ తిరిగి హైదరాబాద్ వచ్చాడు. ఇక హైదరాబాదులో స్టూడియోల చుట్టు అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగినప్పటికీ ఒక్క అవకాశం కూడా రాలేదు. దాంతో సొంత ఊరికి వచ్చి ఆటో తోలుకుంటూ జీవనం వెళ్లదీశాడు. ఇక మళ్లీ స్నేహితుల సలహాతో సినిమాల్లో అవకాశం కోసం హైదరాబాద్ వెళ్లారు. ఇక అదే టైంలో సుకుమార్ అల్లు అర్జున్ తో పుష్ప (Pushpa) సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నారు.

దాంతో చరణ్ మాట్లాడే యాస నచ్చి సుకుమార్ ని పుష్ప సినిమాలో నటించడానికి తీసుకున్నారు. ఎందుకంటే పుష్ప సినిమాలో వాళ్లు మాట్లాడే యాస ఈ సినిమాకి ప్లస్ అయింది. దాంతో చరణ్ తో కలిసి ఇంకో ముగ్గురు యువకులు సినిమాల్లో నటించే నటీనటులకు చిత్తూరు యాస నేర్పించారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో చరణ్ కి మంచి పేరు వచ్చింది. అలాగే పుష్ప (Pushpa) సినిమాలో చేసే టైంలోనే తనకి పెళ్లి కూడా జరిగింది. ఇక ఓ వైపు సినిమాల్లో మంచి పేరు వచ్చి అలాగే జీవిత భాగస్వామి కూడా దొరికేసరికి చరణ్ ఆనందానికి అవధులు లేవు.

Click here for follow Pakkafilmy in google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *