Rythu BandhuRythu Bandhu: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా నిర్వహించే గొప్ప కార్యక్రమం రైతు బంధు. దేశంలో ఎక్కడా లేనటువంటి ఈ పథకం రైతులకు ఎంతో మేలును చేకూరుస్తుంది. ప్రతి ఎకరానికి పదివేల చొప్పున ఏడాదికి రెండు సార్లు రైతు బంధు డబ్బును రైతులకు అందిస్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్.

ఆ విధంగా ఈ ఏడాది రెండో విడత రైతు బంధు(Rythu Bandhu) నగదును ఈ రోజు బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం వరం క్రితమే ఈ డబ్బును జమ చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా ఈరోజు మొదటి విడతగా కొంతమందికి ఈ రైతు బందు నగదు ఖాతాల్లో కి వచ్చాయి.

మొదటగా తక్కువ ఎకరాలున్న భూయజమానులు ఈ పథకం కింద డబ్బు జమవుతుంది. మొత్తం అందరికి ఒకటో తారీకు లోపు ఈ డబ్బు జమ కాబోతుంది అని తెలుస్తుంది. ఏదేమైనా ఈ పథకం వల్ల రైతు బాగు కోరుతున్న కేసీఆర్ కి రైతులు నీరాజనాలు పలుకుతున్నారు.

గత యాసంగి సీజన్ కంటే ఎక్కువమంది ఈ సీజన్ లో రైతు బందును ఎక్కువగా అందుకోబోతున్నారు. డిసెంబర్ 20 నాటికి భూములు కొన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది. మొత్తంగా ఈ సీజన్ లో రూ.7,676 కోట్ల నగదులు రైతులు పొందబోతున్నారు. నిజంగా ఈ పథకం ఇప్పుడు రైతులు కొత్త సంవత్సర వేడుకల్ని ముందే తీసుకొచ్చింది.

Click here for follow Pakkafilmy in google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *