Rebelstar Prabhas

Rebelstar Prabhas: సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో ఎవరు అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే పేరు రెబల్ స్టార్ ప్రభాస్ (Rebelstar Prabhas). అవును మీరు వింటున్నది నిజమే. రెబల్ స్టార్ ప్రభాస్ తన ఒక్కొక్క సినిమాకి 100 నుండి 150 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. బాహుబలి సినిమా వరకు ఈయన రెమ్యూనరేషన్ ఒకలా ఉంటే బాహుబలి సినిమా తర్వాత ఈయన రెమ్యూనరేషన్ భారీగా పెరిగింది. అయితే అలా తన ఒక్క సినిమాకి 150 కోట్లు తీసుకునే ప్రభాస్ కి 21 కోట్ల అప్పు చేయాల్సిన ఇబ్బందులు ఏం వచ్చాయి. మరి ఇంతకీ ఆయన అప్పు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తన ఒక్కొక్క సినిమాకి తన గ్రాఫ్ పెంచుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయారు. అంతేకాదు జక్కన్న డైరెక్షన్లో వచ్చిన బాహుబలి (Bahubali) సినిమాతో ఒక్కసారి గా పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఇక బాహుబలి తర్వాత అన్ని పాన్ ఇండియా ప్రాజెక్టుల్లోనే నటిస్తూ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అయితే అలాంటి ప్రభాస్ ఓ ప్రైవేట్ బ్యాంకులో 21 కోట్ల రూపాయల అప్పు చేశారట. దానికి కారణం బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పై ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా తర్వాత విడుదలైన సాహో, రాధే శ్యామ్ సినిమాలు ప్రభాస్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాయి.

దీంతో ఈ రెండు సినిమాలు ప్లాప్ అయ్యి నిర్మాతలకు చాలా నష్టం మిగిల్చాయి. అయితే ఈ రెండు సినిమాలు ప్రభాస్ సొంత సినిమాలే. అయితే ఈ నేపథ్యంలోనే నిర్మాతలకు నష్టం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభాస్ ఓ ప్రైవేట్ బ్యాంకు నుండి 21 కోట్ల రూపాయల లోన్ తీసుకున్నట్లు ఇండస్ట్రీ జనాలు గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఇక ఈ విషయంలో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయాన్ని ఇండస్ట్రీ జనాల్లో జోరుగా వినిపిస్తోంది.అయితే సాహో, రాధే శ్యామ్ (Radhe shyam) రెండు సినిమాలు ప్లాఫ్ అయినప్పుడు తన రెమ్యూనరేషన్ లో చాలా డబ్బు వెనక్కి ఇచ్చేసారట ప్రభాస్.

ఇక అదే టైంలో ఈ అప్పు తీసుకొని నిర్మాతలకు తిరిగి ఇచ్చేసారని తెలుస్తుంది. అయితే 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ప్రభాస్ (Rebelstar Prabhas) దగ్గర 21 కోట్లు లేవా అని చాలామందికి డౌట్ రావచ్చు. కానీ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా తర్వాత నటించిన ఏ ఒక్క సినిమా రిలీజ్ కాలేదు. అలాగే రిలీజ్ అయ్యాకే సినిమా యూనిట్ మొత్తం డబ్బులను చెల్లిస్తుంది కాబట్టి అప్పటివరకు వేచి చూడాలి. ఇక అప్పటివరకు నిర్మాతలను వెయిట్ చేయించడం ఇష్టం లేక ప్రభాస్ బ్యాంక్ నుండి అప్పుగా తీసుకొని వారికి ఇచ్చినట్లు నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త చాలా వైరల్ అవుతుంది

Click here to follow Pakkafilmy in google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *