Prabhas Wig

Prabhas Wig: టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఈయన మొదటి సినిమాతోనే తన నటన బయటపెట్టి ఆ తర్వాత వరుసగా ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించారు. అంతేకాదు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాతో రాజమౌళి తెలుగువాడి సత్తా ఏంటో ప్రపంచానికి రుచి చూపించాడు. ఇక అలాంటి పాన్ ఇండియా సినిమాలో ప్రభాస్ హీరోగా నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇక బాహుబలి సినిమా తర్వాత ఆయన వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం మూడు నాలుగు సినిమా షూటింగ్ లు ఒకేసారి చేస్తూ చాలా బిజీ బిజీగా ఉన్నారు. ఇక బాహుబలి (Bahubali)  సినిమా తర్వాత వచ్చిన సాహో,రాధేశ్యాం రెండు సినిమాలు ప్లాఫ్ అయ్యాయి. అయితే దానికి కారణం చాలామంది బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ బాహుబలి సినిమా తర్వాత వచ్చిన రెండు సినిమాలు ప్రభాస్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాయి. ప్రస్తుతం ఈయన నటించిన పాన్ ఇండియా మూవీ ఆది పురుష్ షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది.

అలాగే సలార్ (Salaar), ప్రాజెక్టుకే, స్పిరిట్ వంటి సినిమాలు ఈయన చేతిలో ఉన్నాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా ప్రభాస్ గురించి ఒక షాకింగ్ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. అదేంటంటే.. ప్రభాస్ ది ఒరిజినల్ జుట్టు కాదట.ఆయన కూడా విగ్గు ధరిస్తారట. అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు,వెంకటేష్ వంటి హీరోలు విగ్గులు పెట్టుకుంటారు అంటూ ఎన్నో వార్తలు వినిపించాయి. అంతే కాదు వీరిపై వచ్చే వార్తలకు వారికి మేకప్ చేసే మేకప్ మ్యాన్ లు క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా ప్రభాస్ (Prabhas Wig) ది కూడా విగ్గే అంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది.

అయితే ఒక నెటిజన్ ప్రభాస్ విగ్గు వాడుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశాడు. అయితే ఆ నెటిజన్ షేర్ చేసిన వీడియో పాతదే అయినప్పటికీ ప్రస్తుతం ఆ నెటిజన్ మళ్ళీ షేర్ చేసి దాన్ని వైరల్ చేశారు. అయితే ఆ వీడియోలో ప్రభాస్ హెయిర్ స్టైలిస్ట్ ప్రభాస్ జుట్టు సరి చేస్తున్నట్టు ఉంది.అయితే ఆ హెయిర్ స్టైలిస్ట్ ప్రభాస్ జుట్టును పట్టుకున్న విధానం చూస్తే అచ్చం విగ్గు పెడుతున్నట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది ప్రభాస్ అభిమానులు ప్రభాస్ ( Prabhas Wig) ని జంగానే విగ్గు పెట్టుకుంటారా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక విషయంలో క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా ప్రభాస్ స్పందించాల్సిందే.

Click here to follow Pakkafilmy in google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *