Connect ReviewConnect Review : 

నటీనటులు : నయనతార, సత్యరాజ్, అనుపమ్ ఖేర్, వినయ్ రాయ్, హానియా నసిఫా తదితరులు
మ్యూజిక్ : పృద్వీ చంద్ర శేఖర్
ఎడిటింగ్ : రిచర్డ్ కెవిన్
సినిమాటోగ్రఫీ : మణికంఠన్ కృష్ణమాచారి
ప్రొడ్యూసర్ : విగ్నేష్ శివన్
దర్శకత్వం : అశ్విన్ శరవణన్
రిలీజ్ డేట్ : 22-12-2022

లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన హీరోయిన్ నయనతార తాజాగా కనెక్ట్ అనే హారర్ సినిమా లో నటించగా అది ఈ రోజు నడిచింది. ఈ జోనర్ కు ప్రత్యేక మైన అభిమానులు ఉంటారు. ఎప్పుడూ బోర్ కొట్టించని జోనర్ అయిన ఈ హారర్ జోనర్ నుంచి ఇటీవలే సినిమాలు పెద్దగా రాలేదనే చెప్పాలి. అలా ఓ సరికొత్త కథ కథనాలతో విగ్నేష్ శివన్ నిర్మాత గా వ్యవహరించగా నయనతార ప్రధాన పాత్ర లో ఈ సినిమా రూపొందింది. మరి ఈ సినిమా ఏ స్థాయి లో ప్రేక్షకులను ఆకట్టుకుందో ఈ సమీక్ష లో తెలుసుకుందాం.

కథ :

జోసెఫ్ బెనాయ్ (Vinay roy) , సుసాన్ (Nayanatara) భార్యాభర్తలు. వీరికి అమ్ము (హానియా నసీఫా) అనే కూతురు ఉంటుంది. సంగీతం అంటే ఎంతో ఇష్టం ఉన్న అమ్ము లండన్ లో హార్వర్డ్ మ్యూజిక్ స్కూల్ లో సీటు సంపాదిస్తుంది. వృత్తిరీత్యా డాక్టర్ అయిన జోసెఫ్ కోవిద్ పేషెంట్స్ కి చికిత్స అందిస్తూ మరణిస్తాడు. తండ్రి అంటే ఎంతో ఇష్టం ఉన్న అమ్ము పూర్తి డిప్రెషన్ లోకి వెళ్తుంది. మరణించిన తండ్రి తో మాట్లాడాలని ఉయిజా బోర్డు ని ఆశ్రయిస్తుంది. అది కాస్తా వికటించి అమ్ము లోకి దుష్ట శక్తి ఆవహిస్తుంది. అది తెలిసిన సుసాన్ ఎలా తన కూతురు ను ఆ దుష్ట శక్తి నుంచి కాపాడుకుంది. అనేదే ఈ సినిమా కథ.

నటీనటులు :

నటీనటుల నటనే సినిమా కి ప్రధాన బలం అయ్యింది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సామర్ధ్యం ఉన్న నటులే నటించారు కాబట్టి సినిమా కి వారే బలం అయ్యారు. నయనతార తల్లిగా ఎంతో మెప్పించింది. ఆమె పాత్ర నటించడానికి పెద్దగా ఆస్కారం లేకపోయినా కూడా అనేవరకు బాగానే చేసి మెప్పించింది. ఈ సినిమా లో ప్రధాన ఆకర్షణ అమ్ము పాత్ర చేసిన హనీయా. అన్ని సన్నివేశాల్లో చక్కని ప్రదర్శన కనపరిచింది. విశాల్ నటించిన డిటెక్టివ్ సినిమా లో విలన్ గా కనిపించి మెప్పించిన వినయ్ రాయ్ ఈ సినిమా లో కొద్దీ సేపే కనిపించిన ఆకట్టుకున్నాడు. ఇక సీనియర్ నటులైనా సత్యరాజ్, అనుపమ్ ఖేర్ లు అత్యుత్తమ నటన కనపరిచాడు.

సాంకేతిక నిపుణులు :

ఈ సినిమా లో అన్ని విభాగాల కన్నా సౌండ్ విభాగం మంచి పనితనాన్ని కనపరిచింది అని చెప్పాలి. అత్యుత్తమ సౌండ్ డిజైన్ తో పాటు కెమెరా పనితనం కూడా ఆకట్టుకుంది. ఈ రెండు సరిగ్గా వర్క్ అవుట్ అయ్యాయి కాబట్టే థియేటర్ లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తి కి లోనవుతున్నారు. దర్శకుడు అశ్విన్ శరవణన్ కూడా మంచి కథను ఎంచుకున్నాడు. దాని తగ్గ స్క్రీన్ ప్లే డిజైన్ చేయగా అయన టేకింగ్ కి అందరు ఫిదా అవుతున్నారు. మ్యూజిక్ కూడా బాగుంది. కొన్ని కొన్ని సీన్స్ పేలవంగా ఉన్న మ్యూజిక్ నిలబెట్టింది.

ప్లస్ పాయింట్స్ :

భయపెట్టే సన్నివేశాలు

నటీనటులు

సాంకేతిక విభాగం

మైనస్ పాయింట్స్ :

కథ లో కొత్త దనం లేకపోవడం

ప్రాధాన్యం లేని నయనతార పాత్ర

తీర్పు : హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం ఎంతో నచ్చుతుంది. చాలా రోజులుగా ఈ తరహా సినిమాలకు మార్కెట్ లేనప్పటికీ కథ మీద నమ్మకం తోనే ఈ సినిమా చేశారనిపిస్తుంది. అన్ని విభాగాలు బాగా పనిచేసి ఈ సినిమా ను నిలబెట్టారు. హారర్ సినిమా అనుభవాన్ని మరోసారి పొందాలంటే ఈ సినిమా తప్పక థియేటర్స్ లో చూడాల్సిందే.(Connect Review)

రేటింగ్ : 2.75/5

Click here to follow Pakkafilmy in google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *