Salaar

Salaar: ఈశ్వర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు రెబల్ స్టార్ ప్రభాస్.ఈయన కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించారు. ఇక రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన పాన్ ఇండియా సినిమా బాహుబలి తో ఈయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులకు ఓకే చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన చేతిలో ఆది పురుష్, ప్రాజెక్టు కే, సలార్, స్పిరిట్ వంటి నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.

ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ (Prabhas)  మీద చాలామంది భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ నేపథ్యంలోనే బాహుబలి సినిమా తర్వాత సాహో సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది.కానీ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత అద్భుతమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. ఇక ఈ విషయం పక్కన పెడితే పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ అనే సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఒక షాకింగ్ న్యూస్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.

అదేంటంటే.. ప్రభాస్ సలార్ (Salaar) సినిమాలో హీరో కాదట.మరి అసలైన హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. సలార్ సినిమాలో వరదరాజన్ మున్నార్ అనే పాత్రలో ప్రముఖ మలయాళ స్టార్ హీరో అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ (Pruthviraj Sukumaran) నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ హీరో తాజాగా పాల్గొన్న ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సలార్ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. అంతేకాదు ఈ సినిమా జనవరిలో హైదరాబాదులో షూటింగ్ జరుగుతుందని, అలాగే ఇటలీలో కూడా పది రోజులు షూటింగ్ ఉందని చెప్పుకొచ్చారు.

ఇక ఈ నేపథ్యంలోనే ఒక జర్నలిస్ట్ మీరు ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నారా అని అడిగితే దానికి షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు పృథ్వీరాజ్.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. అసలు సలార్ సినిమాలో ప్రభాస్ హీరో కాదు నేను విలన్ ని కాదు అంటూ ఒక షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. అంతేకాదు ప్రశాంత నీల్ డైరెక్షన్లో సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో అంత కన్ఫ్యూజన్ ఉంటుంది అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సలార్ (Salaar) సినిమాలో ప్రభాస్ హీరో కదా మరి హీరో ఎవరు అంటూ చాలా మంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Click here to follow Pakkafilmy in google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *