పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) గత కొంతకాలం నుంచి ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో తనదైన దూకుడు చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఈయ‌న చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్‌ లో `హరిహర వీరమల్లు` ఒకటి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.

అలాగే బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్(arjun rampal), నర్గీస్ ఫక్రీ కీలకపాత్రల్లో కనిపిచంనున్నారని సమాచారం. పవన్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్లో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ఈ మూవీ ప్రారంభమై చాలా కాలమే అయినా.. ఏదో ఒక కారణం చేత షూటింగ్ కు వరుస అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే ఈసారి ఎలాగైనా ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేయాలని పవన్ పట్టుదలతో ఉన్నాడు.

ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ(ramoji film city) లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అయితే తాజాగా షూటింగ్ నుంచి చిన్న బ్రేక్ దొరకడంతో పవన్ కళ్యాణ్ సూపర్ స్టైలిష్ అండ్ లగ్జరీ బైక్ పై రయ్యి రయ్యి మంటూ చక్కర్లు కొట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్ప‌టికే నెట్టింట వైర‌ల్ అయ్యాయి. అయితే ఇప్పుడు పవన్ నడిపిన ఆ స్టైలిష్ బైక్ ధ‌ర‌ హాట్ టాపిక్ గా మారింది. అస‌లు ఆ బైక్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరగాల్సిందే.

పవన్ నడిపిన ఈ బైక్ ప్రముఖ సంస్థ బీఎండబ్ల్యూ(BMW) కంపెనీ కు చెందినది. `బీఎండబ్ల్యూ ఆర్1250 జీఎస్` మోడల్ కు చెందిన ఈ బైక్ ధర అక్షరాలా రూ. 24 లక్షలు. ఇంకేముందే అంత ఖ‌రీదైన బైక్ పై ప‌వ‌న్ ను చూసి ఇటు జనసైనికులు.. అటు పవన్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. అంతేకాదు, ప‌వ‌న్ డ్రైవ్ చేయ‌డం వ‌ల్ల ఆ బైక్ విలువ మ‌రింత పెరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలోనే `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` షూటింగ్ పూర్తైన వెంట‌నే ప‌వ‌న్ బస్సు యాత్ర చేపట్ట‌బోతున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed