దర్శకుడు పూరీ జగన్నాధ్ మెగా స్టార్ చిరంజీవి కలయిక లో ఓ సినిమా గతంలో రావలసి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఆటో జానీ అనే సినిమా తో పూరీ చిరు 150 సినిమా గా చేయవలసి ఉంది కానీ చిరు కి కథ లో సెకండ్ పార్ట్ నచ్చక పోవడం తో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ఇద్దరు తమ తమ సినిమాలు చేసుకుంటూ వచ్చారు. అయితే తాజాగా పూరి జగన్నాధ్ కు చిరు డైరెక్ట్ చేసే మరో అవకాశం వచ్చింది అని చెప్పాలి.

ఇటీవలే చిరు నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదల కాగా అందులో ఓ కీలక పాత్ర లో పూరీ నటించాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా పూరి చిరంజీవి ఇన్స్ టా వేదికగా చేసిన ఇంటర్వ్యూలో మరోసారి ఆటో జానీ ప్రస్తావన వచ్చింది. తనతో సినిమా చేయడానికి ఎప్పటికైనా సిద్ధమే అని పూరీ తో చిరు చెప్పడం విశేషం. సో పూరి జగన్నాథ్ అంత పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో రావాలే కానీ గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు. మరి త్వరలోనే వీరి కాంబో సినిమా వస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed