అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం అలవైకుంఠపురంలో. 2020లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ డాన్స్ పెర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. అంతేకాదు ఈ చిత్రానికి తమన్ సంగీతం ప్లస్ పాయింట్ అయింది. అయితే కాసేపు ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఈ చిత్రంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన మరో అంశం ఇల్లు.. టబూ ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ అసలైన తల్లిదండ్రులు నివసించినట్టు చూపించిన ఆ ఇల్లు సినిమాకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.

Ala Vaikunthapurramloo Movie House Owner Details - Sakshi Telugu

సినిమా ఆరంభంలోనే అల్లు అర్జున్ ఇంట్లోకి అడుగు పెడతాడు. అప్పుడు ఇంటి గేట్లు చూపిస్తారు. ఆ తర్వాత ఇంట్లోని సన్నివేశాలు.. ఇంటిలో తీసిన సీన్స్ అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. థియేటర్లో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఇలు ఇంద్ర భవనం లాగా ఉందే అంటూ ఆ ఇంటిని చూసి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.. ముఖ్యంగా ఇంటిముందు భారీ గేట్లు, ఇంట్లో ఫర్నిచర్, చుట్టూ విశాలమైన స్థలం , ఇంటీరియర్ డిజైన్ అన్నీ కూడా అందర్నీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ కి ఈ ఇల్లు బాగా నచ్చేసింది. ఈ క్రమంలోనే ఆ ఇల్లు ఎవరిది? దాని ఖరీదు ఎంత? అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

Behind the story of ala vaikunthapurramuloo house | klapboardpost

మరి ఈ అందమైన ఇల్లు ఎవరిదో కాదు.. ఎన్ టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి కూతురు రచనా చౌదరి భర్తది.. దీని విలువ అక్షరాల రూ. 100 కోట్లు.. ఈ సినిమా బ్యానర్ నిర్మాత అయిన రాధాకృష్ణకు ఇంటి యజమానులు బంధువులు అవుతారు. అయితే సినిమా ఆర్ట్ డైరెక్టర్ భారీ సెట్స్ వేసి నిర్మించాలని చెప్పడంతో.. రాధాకృష్ణ ఆ ఇల్లు చూపించి అదే ఇంటిని ఫైనల్ చేశారట. అంతేకాదు ఇంటికి బయట ఉండే సీన్స్ కోసం రూ.ఐదు కోట్లతో అన్నపూర్ణ స్టూడియోలో సెట్స్ వేసినట్టు సమాచారం. మొత్తానికైతే ఈ ఇల్లు ఖరీదు తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *