దక్షిణాది సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్ కాంట్రవర్సీలకు చాలా వరకు దూరంగానే ఉంటుంది. సైలెంట్ గా తన సినిమాలు తాను చేసుకుంటూ ఎక్కువగా గ్లామర్ డోస్ లేకుండా మంచి పాత్రల్లో కనిపించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. అంతేకాదు పాత్రల ఎంపిక విషయంలో కూడా చాలా సెలెక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. నిజానికి నిత్యామీనన్ ఒక సినిమాలో నటిస్తోంది అంటే తప్పకుండా ఆ సినిమాలో తన పాట ఏదో ఒక బలమైన పాత్ర అయి ఉండి ఉంటుంది అని అందరూ అనుకుంటారు. అంతే కాకుండా కథలో కంటెంట్ కూడా సరిగా కొత్తగా ఉంటుంది అనే విధంగా ఒక వర్గం ప్రేక్షకులలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

The media fooled me #8211; Nitya Menon

అయితే నిత్యామీనన్ గతంలో ప్రభాస్ పై చేసిన కొన్ని కామెంట్స్ ఒక వర్గం అభిమానులను ఎంతగానో ఆగ్రహానికి గురిచేశాయి. మీడియాలో కూడా ఈ విషయం చాలా వైరల్ అయింది.” అలా మొదలైంది” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిత్యామీనన్ ఆ తర్వాత తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయింది. అయితే ఒక ఇంటర్వ్యూలో అప్పట్లో ప్రభాస్ ఎవరో తెలియదని.. ఎవరు? అని అడిగింది.. నిత్యామీనన్. దీంతో ఆ కామెంట్స్ ప్రభాస్ అభిమానులకు మరింత అగ్రహాన్ని తెప్పించాయి. ఆ నెగటివ్ కామెంట్స్ ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉండడం గమనార్హం.

అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నిత్యమీనన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అప్పటికి ఇంకా బాహుబలి లాంటి సినిమా రాలేదు . నేను మలయాళం లోనే సరిగ్గా సినిమాలు చూడను. ఇక తెలుగు సినిమాల గురించి ఏం తెలుస్తుంది .తెలుగు అంటే అప్పట్లో చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున , అల్లు అర్జున్ ఈ పేర్లు మాత్రమే ఎక్కువగా వినిపించేవి. అదే విధంగా నేను ఈ మాటల్లో పడి ప్రభాస్ పేరు వినిపించినప్పుడు ప్రభాస్ ఎవరు? అని అన్నాను. అంతేకానీ ఆయనను తక్కువ చేసి మాట్లాడలేదు.

దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకొని మీడియాలో ప్రచారం చేశారు . ఇలా చేయడం వల్ల ప్రభాస్ ను అన్నందుకు నా సినీ కెరియర్ కూడా నాశనం అయ్యింది అంటూ బాధపడింది నిత్యామీనన్.

Nithya Menon: Naku Telugu lo Chiranjeevi, AlluArjun, venkatesh Telusu
Prabhas evaro appudu Naku Thelidhu
Before Baahubali Telugu States lone Prabhas Thelidhu Nithya Menon ki ela thelusthadhi le ?? pic.twitter.com/6Y78dZJ0Y2
— JuLaYi ᴬᴬ? (@JuLaYiAADHF) November 18, 2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *