చిరంజీవి హీరో గా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో రవితేజ నటిస్తున్నాడు. ఇది అందరిలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. వాల్తేరు వీరయ్య సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వెలువడుతున్నాయి.

నిజాయితీగా ఉండే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పై పడిన నిందను తన అన్నయ్య ఎలా తొలగించాడు. అలాగే మళ్ళీ అతనిపైనే ప్రశంసలు కురిసేలా ఎలా చేశాడు? అనేది ఈ సినిమాలో అసలు కథ.. అని తెలుస్తోంది. ఈ సినిమా లో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతో ఆసక్తి పరిచింది. సంక్రాంతి ఫైట్ లో వాల్తేరు వీరయ్య పై చేయి సాధించే అవకాశం అయితే ఉంది. ఈ సీజన్ లో బాలకృష్ణ సినిమా వీర సింహ రెడ్డి కూడా విడుదల కాబోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed