నాగశౌర్యకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. లవర్ బాయ్ గా అమ్మాయిల్లో మంచి ఇమేజ్ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఆయన యాక్షన్ సినిమాలు చేసి దెబ్బతిన్నాడు. మళ్లీ ట్రాక్ ఎక్కడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒక వైపున బయట సినిమాలు చేస్తూనే, మరో వైపున తన సొంత బ్యానర్లో వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు.

అలా అతను చేస్తున్న రెండు మూడు సినిమాలు ప్రస్తుతం షూటింగు దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతను మరో ప్రాజెక్టును సెట్ చేశాడు. వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్లో ఆయన ఒక సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ సినిమాకి శ్రీనివాసరావు … విజయ్ కుమార్ .. అశోక్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకి అరుణాచలం దర్శకత్వం వహించనున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed