తన నటనతో సినీ ఇండస్ట్రీలో నటశేఖరుడు గా పేరు తెచ్చుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. అలాంటి కృష్ణ గారు అనారోగ్య సమస్యలతో నవంబర్ 15 మంగళవారం రోజు తెల్లవారుజామున మరణించారు. ఇక ఈయన మరణం ఎంతోమంది హృదయాలను కలిసివేసింది. ఇక ఘట్టమనేని ఇంట్లో వరుసగా ఈ ఏడాది ముగ్గురు చనిపోయారు. ఈ విషయంలో మహేష్ బాబు అన్న, తల్లి అలాగే ఇప్పుడు తండ్రిని కోల్పోవడంతో ఒంటరి వాడయ్యాడు.

ఇక కృష్ణ రెండో భార్య విజయనిర్మల కొడుకు నరేష్ తండ్రి కానీ తండ్రి కృష్ణ అంత్యక్రియలు అన్ని దగ్గరుండి చూసుకున్నారు. అయితే కృష్ణ చనిపోయిన బాధనుండి ఇంకా ఆ ఫ్యామిలీ తేరుకోక ముందే నటి పవిత్ర లోకేష్ నరేష్ కి ఒక బిగ్ ట్విస్ట్ ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నటుడు నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకొని ఆ ముగ్గురు భార్యలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఈయన క్యారెక్టర్ ఆర్టిస్టు పవిత్ర లోకేష్ తో గత సంవత్సరం నుండి సహజీవనం చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక వీళ్ళిద్దరూ అధికారికంగానే మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ క్లారిటీ ఇచ్చారు.

వీళ్లిద్దరూ కలిసి తిరగడంతో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వీరిని మీద చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించింది. బెంగళూరులోని ఓ హోటల్ లో ఉన్న ఈ ఇద్దరినీ రమ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మీడియా ముందు నానా రచ్చ చేసింది. ఇక ఈ విషయం పక్కన పెడితే నటుడు నరేష్ వేరే అమ్మాయి మోజులో పడి పవిత్ర లోకేష్ ని దూరం పెట్టాడు అంటూ కొన్ని వార్తలు ఈ మధ్యన వినిపించాయి. కానీ ఈ వార్తలన్నీ అవాస్తవం అని తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే కృష్ణ మరణించాక ఆయన అంత్యక్రియల్లో నరేష్ తో కలిసి పవిత్ర లోకేష్ కనిపించింది.

అలాగే నరేష్ పవిత్ర లోకేష్ పై చేతులు కూడా వేస్తూ నడిచాడు.అయితే కృష్ణ చనిపోయి మూడు రోజులు కాకముందదే పవిత్ర లోకేష్ నరేష్ ని మనం పెళ్లి ఇంకా ఎప్పుడు చేసుకుంటాం అని అడిగిందట. అంతేకాదు ఇంకెన్ని రోజులు ఇలా సహజీవనం చేయడం ముందు మనం పెళ్లి చేసుకుందాం అంటూ నరేష్ కి పవిత్ర లోకేష్ చెప్పిందట. ఇక ఈ విషయంలో నరేష్ పవిత్ర లోకేష్ పై ఫైర్ అయినట్లు తెలుస్తోంది. అంతే కాదు కృష్ణ చనిపోయి ఇంకా మూడు రోజులైనా పూర్తికాలేదు అప్పుడే మనం పెళ్లి చేసుకుందాం అని అంటున్నావ్ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ పవిత్ర లోకేష్ కి క్లాస్ పీకాడట. అయితే ఈ విషయంలో నిజమెంతో అబద్ధమెంతో తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed