సినీ ఇండస్ట్రీలో ఎవరి జీవితం ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు.అందుకే సినిమా అవకాశాలు వచ్చినప్పుడు వాటిని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే నాలుగు రాళ్ళను వెనకేసుకుంటారు. కెరీర్ మంచి టైంలో నడుస్తున్నప్పుడు ఎలాంటి తప్పటడుగులు వేసినా ఇండస్ట్రీలో వెనక్కి వెళ్లిపోవడం ఖాయం. అలాంటి తప్పటడుగులు వేసిన వారిలో సావిత్రి ఒకరు . ఆమె వేసిన తప్పటడుగులే ఆమె కెరీర్ ని నాశనం చేశాయి. ఆమె అనేక దానధర్మాలు చేసి తన చివరి రోజుల్లో దుర్భరంగా గడిపి కన్నుమూసింది.

మరోవైపు పవన్ కళ్యాణ్ సరసన నటించిన దేవయాని కూడా కొన్ని తప్పులు చేసి కోలుకోలేని దెబ్బ తిన్నది.ఇక దేవయాని 1993లో తన కెరీర్ ను బెంగాలీ సినిమాతో మొదలుపెట్టింది. ఆ తరువాత తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే మంచి సినిమాల్లో నటించింది. అంతేకాకుండా ఆ సినిమాలు మంచి హిట్ లను కూడా సాధించాయి. ఆ తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సుస్వాగతం సినిమాలో నటించి మంచి పేరును కూడా సంపాదించుకుంది. దేవయాని. ఆ తరువాత శ్రీకాంత్ తో కూడా నటించింది. చెప్పాలంటే దేవయాని మొత్తం అన్ని భాషలలో కలిపి 90 సినిమాలు నటించింది. అయితే సీరియల్స్ ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

ఇకచెప్పాలంటే దేవయాని అసలు పేరు సుష్మ ఆమె ఏ సినిమాలో నటించిన సాంప్రదాయ పాత్రలనే పోషించింది. ఆమె కెరీర్ లో ఉన్నట్టుగానే వివాహం చేసుకుంది. ఫ్యామిలీతో ఎక్కువగా ఉండటంతో ఆమె అవకాశాలు చాలా తగ్గిపోయాయి. అంతేకాకుండా దేవయాని నిర్మాతగా మారి కొన్ని సినిమాలను నిర్మించింది. అయితే దేవయాని నిర్మించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో తన ఆస్తి అంతా కరిగిపోయింది. ఆమె కెరీరంతా తలకిందలైంది. చివరకు ఓ స్కూల్లో టీచర్గా చేరింది.

తర్వాత సెకండ్ కెరీర్ ని మొదలుపెట్టి తల్లి పాత్రలు చేసింది. ఆ తరువాత శరత్ కుమార్ ను ప్రాణంగా ప్రేమించి రహస్యంగా డేటింగ్ కూడా చేసింది. అయితే వీరిద్దరి పెళ్లికి శరత్ కుమార్ వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్న దేవయాని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో అతనికి బ్రేకప్ చెప్పి రాజ్ కుమార్ ని వివాహం చేసుకుంది. మొత్తానికి దేవయాని టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *