వారసుడు డబ్బింగ్ సినిమానే.. తేల్చేసిన వంశీ!!

విజయ్ దళపతి హీరో గా తెరకెక్కిన వారసుడు సినిమా సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. తమిళంలో వారిసు అనే టైటిల్ ని నిర్ణయించగా మొదటి నుంచి ఈ సినిమా ద్విభాషా చిత్రంగా పేర్కొనగా ఇది తెలుగు లో తెరకెక్కింది అన్నారు. కానీ తాజాగా ఇది తెలుగు లో డబ్ అవుతున్న సినిమా అని చెపుతున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి.

విజయ్ జోడీగా రష్మిక అలరించనున్న ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ .. ప్రభు .. శ్రీకాంత్ .. ఖుష్బూ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.ఇక ఈ సినిమా తరువాత, తనకి ‘మాస్టర్’ తో హిట్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్ తో విజయ్ సినిమా ఉండనుందనే సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *