దీపావళి కి మెగా మాస్ జాతర షురూ!!

మెగా స్టార్ చిరంజీవి హీరో గా రూపొందుతున్న 154 వ సినిమా యొక్క టైటిల్ ను దీపావళి నాడు రివీల్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అక్టోబరు 24న ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు ఘనంగా నిర్మిస్తున్నారు.

రవితేజ ఓ కీలక పాత్ర లో నటిస్తున్న ఈ ఈ మాస్ ఎంటర్టయినర్ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా సంక్రాంతి కి విడుదల కాబోతు ఉండడం విశేషం. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమా తో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న మెగా స్టార్ ఈ సినిమా తో ఎలా అలరిస్తాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *