ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూనందమూరి బాలకృష్ణ ల్ జంటగా ‘విజేత’ సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వంలో జీఏ-2 పిక్చర్స్‌ ధీరజ్ మొగిలినేని నిర్మించిన తాజా చిత్రం “ఉర్వశివో రాక్షసివో”. అనూప్‌ రూబెన్స్, అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రానికి విజయ్ ఎం సహ నిర్మతగా వ్యవహారించారు. ఈ చిత్రం నుండి విడుదల చేసిన టీజర్ కు, సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన లభించింది. నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దర్శకులు సాయి రాజేష్, చందు మొండేటి, వశిష్ట, వెంకటేష్ మహా, పరుశరామ్, మారుతి, నిర్మాత జెమిని కిరణ్, యస్. కె. యన్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.ఈ ఈవెంట్లో అల్లు శిరీష్ అడిగిన క్వశ్చన్ కు బాలకృష్ణ గారు లైవ్ లో ఆన్సర్స్ ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది. బాలకృష్ణ గారు చిత్ర ట్రైలర్ ను విడుదల చేసిన అనంతరం అల్లు అరవింద్ గారు అందించిన “ఉర్వశివో రాక్షసివో” బిగ్ టికెట్ ను బాలకృష్ణ గారు విడుదల చేశారు

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ..ఇక్కడకు వచ్చిన దర్శకులు అందరూ ఇప్పుడున్న ట్రెండ్ కు తగ్గట్టు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తూ వారిని వారే ఆవిష్కరించు కుంటూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. అల్లు వారి ఫ్యామిలీ తో మాకు ఎంతో తత్సంబంధాలు ఉన్నాయి . అలాగే అల్లురామలింగయ్య గారితో కొన్ని సినిమాలలో నటించే అదృష్టం కూడా నాకు దక్కింది. యాక్టింగ్ పరంగా నన్ను మించిన వాడు లేడనే గర్వం ఉండకూడదు. ఆలా లేనందుకే వారు ఎన్నో సినిమాలు చేశారు.అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ ను స్థాపించి పెద్ద స్థాయికి తీసుకు వచ్చాడు.దీనికోసం తను చాలా కష్టపడ్డాడు. అయన అసోసియేషన్ లో నేను చేసిన ఆన్ స్టాపబుల్ మంచి సక్సెస్ అయ్యింది. అది ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో కూడా వివరించడం జరిగింది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. ఒక కుటుంబాన్ని నిలబెట్టాలన్న కూల్చాలాన్నా ఆ కుటుంబ బరువు బాధ్యతలు వారి చేతుల్లోనే ఉంటుంది. అయితే ప్రస్తుతం యూత్ అభిరుచులు మారుతున్నాయి.. సహజీవనం, ఎఫైర్స్ అనేవి నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించేలా దర్శక, నిర్మాతలు కృషి చెయ్యాలి. ఈ సినిమాకు అచ్చు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అనూప్ పాడిన పాట బాగుంది. అల్లు శిరీష్, అను లు సినిమాకు తగ్గట్టు చాలా బాగా యాక్టింగ్ చేశారు. దర్శకుడు తీసిన విధానం బాగుంది హీరో హీరోయిన్ లా నుండి అద్భుతమైన నటనను రాబాట్టుకున్నాడు. ఊర్వశివో రాక్షసివో సినిమా ట్రైలర్ చూస్తుంటే న కొత్తగా అందంగా కలర్ ఫుల్ గా రొమాంటిక్ గా కనిపిస్తుంది. అందుకే ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 అయితే దాన్ని నవంబర్ 4 కు మార్చాల్సి వస్తుందేమో అనిపించింది (నవ్వుతూ)..నాకు ఇలాంటి చిత్రాల్లో నటించాలని ఉంటుంది. కాకపోతే నా అభిమానులు, ప్రేక్షకులకు నచ్చనిది, వాళ్లపై బలవంతంగా రుద్దాలనుకోను. నవంబర్ 4 న విడుదల అవుతున్న సినిమా చిత్ర యూనిట్ అందరికీ పెద్ద విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ..మా టీం ను బ్లెస్స్ చేయడానికి వచ్చిన బాలయ్య బాబు గారికి మరియు ఇక్కడకు వచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ స్క్రిప్ట్ ఇచ్చిన భరద్వాజ కు థాంక్స్ చెప్పాలి. అలాగే దర్శకుడు రాకేష్ చేసిన సినిమా ఆడక పోయినా మేము నమ్మి భరద్వాజ గారు ఇచ్చిన స్క్రిప్ట్ ఇచ్చాము . అయితే తను మా నమ్మకాన్ని నిలబెడుతూ బాగా తీశాడు. భరద్వాజ గారు ఈ సినిమా చూసి బాగుందని చెప్పడంతో హ్యాపీ ఫీలయ్యాము. జూబ్లీహిల్స్ కుర్రాన్ని మిడిల్ క్లాస్ కుర్రాడు గా ఈ సినిమాలో చూయించాము.తను కూడా ఛాలెంజ్ గా తీసుకుని నటించాడు. ప్రస్తుతం యూత్ పేస్ చేస్తున్న ప్రాబ్లెమ్స్ ను ఈ సినిమాలో చూయించడం జరిగింది. యూత్ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. అలాగే బన్నీ వాసు ఈ సినిమా ముందుకు రాకుండా వెనుక ఉండి వర్క్ చేస్తున్నాడు. శిరీష్, అను ఇద్దరూ బాగా నటించారు. టెక్నిషియన్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. నవంబర్ 4 న వస్తున్న ఈ సినిను అందరూ ఆదరించాలని కోరుతున్నాను అన్నారు.

నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. మా నాన్న, అల్లు అరవింద్ ఫ్యామిలీ మంచి ఫ్రెండ్స్ వారితో పాటు మేము కంటిన్యూ అవుతున్నాందుకు హ్యాపీ గా ఉంది. బాలకృష్ణ గారు ఈ ఫంక్షన్ కు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కొరకు చాలామంది డైరెక్టర్స్ ను అనుకున్నాము. చివరకు విజేత’ సినిమా దర్శకుడు రాకేష్ శశి కి అవకాశం ఇచ్చాము. తను ఈ సినిమాను చాలా బాగా తెరకెక్కించాడు. నేను ఈ సినిమా చూశాను చాలా బాగుంది .హీరో, హీరోయిన్ లు చాలా బాగా నటించారు. వెన్నెల కిషోర్, సునీల్ కామెడికు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. నవంబర్ 4 న వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవుతుందని అన్నారు.

చిత్ర దర్శకుడు రాకేష్ శశి మాట్లాడుతూ..మా ఈవెంట్ కు వచ్చిన బాలకృష్ణ గారికి ధన్యవాదాలు.అయన నటించిన
సమర సింహా రెడ్డి సినిమా చూసిన తరువాత ఇదిరా సినిమా అనిపించింది. ఆసినిమా ద్వారానే నాకు సినిమాలలోకి రావాలనిపించింది.గీతా ఆర్ట్స్ లో సినిమా అంటే అందరి డ్రీమ్. అలాంటిది నాకీ అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది.ఈ సినిమాలో రీల్ లైఫ్ క్యారెక్టర్ కు రియల్ లైఫ్ క్యారెక్టర్ కు చాలా తేడా ఉంటుంది. అల్లు సిరీస్, అను ఇమ్మాన్యూల్ లు ఈ సినిమా కొరకు చాలా కష్టపడి చేశారు. మా కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. అచ్చు గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.వెన్నెల కిషోర్, సునీల్, అల్లు శిరీష్ ఈ ముగ్గురు కలిసిన సీన్స్ కు ప్రేక్షకులు ఫుల్ ఎంటర్ టైన్ అవుతారు. నవంబర్ 4 న వస్తున్న మా సినిమాను అందరూ విజయవంతం చేయాలని అన్నారు.

చిత్ర హీరో అల్లు శిరీస్ మాట్లాడుతూ..మా ఈవెంట్ కు వచ్చిన బాలయ్య గారికి ధన్యవాదములు. చిన్నప్పుడు బాలయ్య గారి సినిమాలు చూసేవాన్ని. ఇప్పుడు కూడా మా జోష్ తగ్గినా.. బాలకృష్ణ గారి జోష్ తగ్గలేదు. సినిమా సినిమాకు తను నిత్య యవ్వనుడిలా ఉంటాడు. తను ఇలాగే ఉంటూ ఎన్నో సినిమాలు చెయ్యాలి.మా నాన్న తో కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు రెండు సినిమాలు చేశాను అవి రెండు హిట్ అయ్యాయి. ముచ్చటగా మూడో సారి చేస్తున్న ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను.మా దర్శకుడు రాకేష్ పని రాక్షసుడు అని చెప్పవచ్చు.ఈ సినిమా బాగా రావడానికి చాలా కష్టపడ్డాడు .అచ్చు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అనూప్ తో చేయాలను కున్నాము. కానీ తను వచ్చి నాకొక మంచి పాట ఇచ్చారు. డి. ఓ. పి గారు నన్ను బాగా చూయించారు. వెన్నెల కిషోర్, సునీల్, పోసాని కృష్ణ మురళీ ఇలా చాలా మంది ఈ సినిమాలో నటించారు. ఈ స్క్రిప్ట్ ను అందించిన తమ్మారెడ్డి గారికి ధన్యవాదములు. అను అందాలను గత చిత్రాల్లో చూశాము. తనలోని ఆర్టిస్ట్ ను ఈ సినిమాలో చూస్తాము.సార్.. మేడమ్ సార్ అన్నట్టు అద్భుతంగా నటించింది. తను గ్రేట్ కో స్టార్. తనతో కలసి నటించడం చాలా హ్యాపీ గా ఉంది. నవంబర్ 4 న వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించాలని అన్నారు.

చిత్ర హీరోయిన్ అను ఇమ్మాన్యూల్ మాట్లాడుతూ..గత 2 సంవత్సరాల నుండి ఈ సినిమా కొరకు ట్రావెల్ అవుతున్నాను. శిరీష్ చాలా మంచి లవ్లీ కో స్టార్. దర్శకుడు బాగా తీశాడు. అచ్చు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నవంబర్ 4 న వస్తున్న మా రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఉర్వశివో రాక్షసివో” సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. కల్మషం లేని వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి బాలకృష్ణ. తనతో వర్క్ చేసిన వారందరూ అదే చెపుతారు.తను వచ్చి ఈ టీం ను బ్లెస్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది.గత 2 సంవత్సరాల నుండి ఈ సినిమా కొరకు కష్టపడి పని చేస్తున్నారు. సినిమా బాగా వచ్చింది.ఈ సినిమాకు పని చేసిన వారందరికీ ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి అన్నారు

దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ..నాకు బాలకృష్ణ గారి సినిమాలంటే చాలా ఇష్టం.ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే దర్శకుడు రాకేష్ శశి బాగా చేశాడనిపిస్తుంది. అల్లు శిరీస్ , అను ఇమ్మాన్యూల్ లకు, మరియు టెక్నిషియన్స్ అందరికీ ఈ సినిమా బాగా ఆడాలని టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు

దర్శకుడు వశిష్ట మాట్లాడుతూ..ఈ సినిమాలో హీరో, హీరోయిన్ లిద్దరూ బాగా నటించారు . సిరీస్ కు ఆర్య సినిమా అంతటి బిగ్ హిట్ అవ్వాలి అన్నారు

దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ.. గీతా ఆర్ట్స్ తో నాకు మంచి అనుభందం ఉంది.రాకేష్ ఈ సినిమా కొరకు చాలా ఎఫర్ట్ పెట్టాడు. తను పడిన కష్టానికి ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి. అచ్చు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.

చిత్ర సంగీత దర్శకుడు అచ్చు రాజమణి మాట్లాడుతూ..రాకేష్ గారు ఫుల్ పర్ఫెక్షనిస్ట్ వెన్నెల కిషోర్, సునీల్ కామెడీ అందరూ ఎంజాయ్ చేస్తారు. అల్లు సిరీస్, అను ఇమ్మాన్యూల్ ఇద్దరూ అద్భుతంగా నటించారు. ఈ సినిమా పాటలకు మంచి ఆధరణ లభించింది. పాటలను అదరించి నట్లే నవంబర్ 4 న వస్తున్న మా సినిమాను ఆధరించి పెద్ద హిట్ చెయ్యాలి అన్నారు.

నటుడు సునీల్ మాట్లాడుతూ.. గీతా ఆర్ట్స్ లో వచ్చిన సినిమాలకు టికెట్ కొనుక్కొని చూసిన నాకు గీతా ఆర్ట్స్ లో నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో నా పాత్ర బాగుంటుంది. అందరూ బాగా నటించారు. నవంబర్ 4 న వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అన్నారు.

దర్శకుడు పరుశరామ్ మాట్లాడుతూ..నాకు సరైన హిట్స్ లేని టైంలో గీతా ఆర్ట్స్ లో శిరీష్ నాకు “శ్రీ రస్తు శుభమస్తు” సినిమా చేసే అవకాశం ఇచ్చారు. ఆలా తను అవకాశం ఇవ్వడం వలెనే నేను మహేష్ బాబు తో “సర్కారు వారి పాట” సినిమా చేయగలిగాను. త్వరలో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు

లిరిక్ రైటర్ పూర్ణచారి మాట్లాడుతూ..ఈ సినిమాకు నేను రాసిన దీంతనన పాట నాకు మంచి పేరు తెచ్చింది. గీతా ఆర్ట్స్ వంటి పెద్ద బ్యానర్ లో ఈ పాట రాసే అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్ గారికి, అచ్చు రాజమణి లకు ధన్యవాదాలు అన్నారు.

సినిమా పేరు: “ఊర్వశివో రాక్షసివో”
హీరో: అల్లు శిరీష్
హీరోయిన్: అను ఇమాన్యుయేల్
దర్శకుడు: రాకేష్ శశి
సంగీత దర్శకుడు: అచ్చు రాజమణి
నిర్మాత: ధీరజ్ మొగిలినేని
బ్యానర్ పేరు: GA2 పిక్చర్స్
సమర్పకులు: అల్లు అరవింద్
సహ నిర్మాత విజయ్ ఎం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – బాబు గారు
DOP- తన్వీర్
ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్
PRO: ఏలూరుశ్రీను , మేఘశ్యామ్

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *