సినీ అతిరధుల సమక్షంలో గ్రాండ్ గా జరిగిన “టాప్ గేర్” ప్రి రిలీజ్ వేడుక.. డిసెంబర్ 30 న గ్రాండ్ రిలీజ్

యంగ్ అండ్ లవ్‌లీ హీరో ఆది సాయి కుమార్ వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పుడు ‘టాప్ గేర్’ వేసి మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కె. శశికాంత్ దర్శకత్వంలో  K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఈ టాప్ గేర్ సినిమా తెరకెక్కింది. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సర్వ హంగులతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదల కాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి హీరో సందీప్ కిషన్, సాయి కుమార్, బెక్కం వేణుగోపాల్, యన్ శంకర్, నిర్మాతలు దామోదర ప్రసాద్, అనిల్ సుంకర, రాధా మోహన్, నటుడు డి. యస్. రావు, డైరెక్టర్ శేఖర్ సూరి, సత్తి బాబు, నారాయణ్ గౌడ్, హరీష్, సుదర్శన్ రెడ్డి తదితరులు ముఖ్య అతిదిలుగా పాల్గొన్నారు. హీరో సందీప్ కిషన్, డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు టాప్ గేర్ బిగ్ టికెట్ ను లాంచ్ చేశారు

అనంతరం డైలాగ్ కింగ్ సాయికుమార్ మాట్లాడుతూ.. మా నాన్న తో మొదలైన మా జర్నీ ఇప్పుడు ఆది వరకు వచ్చింది. ఆదిని ఒక క్రికెటర్ అవ్వాలని అనుకొన్నాము. కానీ మెగాస్టార్ అన్నయ్య సాంగ్ తో ఇండస్ట్రీ కు వచ్చాడు. మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అందరూ ఈ “టాప్ గేర్” సినిమా ట్రైలర్, టీజర్ బాగుందని మెచ్చుకుంటున్నారు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా మా ఆది కి బిగ్ బ్రేక్ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ కొత్త సంవత్సరంలో వస్తున్న ఈ సినిమా నిర్మాత శ్రీధర్ రెడ్డి గారి కి నిజంగా “టాప్ గేర్” అవ్వాలి. మ్యూజిక్ డైరెక్టర్ హర్ష మంచి మ్యూజిక్ ఇచ్చాడు. వెన్నెల వెన్నెల సాంగ్ చాలా బాగుంది. ఆదికి శశికి, హర్ష, శ్రీధర్ రెడ్డి లకు అందరికీ ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *