వారసుడు సినిమా నుంచి భారీ అప్డేట్!!

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ దళపతి హీరో గా తెరకెక్కుతున్న సినిమా వారసుడు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టడానికి రంగం సిద్ధమవుతుంది. తెలుగు అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా లో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. తమిళంలో ఈ సినిమాకి ‘వరిసు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ ను విడుదల చేయడానికి రంగం సిద్ధం అయ్యింది.

దీపావళికి ఫస్టు సింగిల్ రిలీజ్ కానున్నట్టు చెప్పాడు. ‘బీస్ట్’ తరువాత విజయ్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.తమన్ స్వరపరిచిన పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. మరి దీపావళికి ఈ సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ ఇస్తారా అనే ఆసక్తి అభిమానులలో నెలకొంది.దానికి తగ్గట్లు ఆ అప్డేట్ వారిని ఏ స్థాయి లో అలరిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *