శివ కార్తికేయన్, విజయ్ దేవరకొండల కాంబో లో సినిమా!!

శివ కార్తికేయన్ హీరో గా నైటిస్తున్న ప్రిన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలుగు స్టార్ హీరో విజయ్ దేవరకొండ గెస్ట్ గా వెళ్లిన సంగతి తెలిసిందే. లైగర్ సినిమా తర్వాత తొలిసారి తెలుగు మీడియా ను పేస్ చేసిన విజయ్ దేవరకొండ ఏం మాట్లాడతారో అన్న ఆసక్తి అందరిలో నెలకొన్న నేపథ్యంలో ఈ వేడుక నిన్న గ్రాండ్ గా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన విడుదలవుతోన్న ఈ సినిమా ఏ స్థాయి లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

అయితే ఈ వేడుకలో స్పీచ్ లో శివ కార్తికేయన్ మాట్లాడుతూ “ఈ ఫంక్షన్ కి విజయ్ దేవరకొండ రావడం ఆనందంగా ఉంది. ఆయన చేసిన ‘గీత గోవిందం’ సినిమాను నేను చాలాసార్లు చూశాను. నా జర్నీ ట్రైన్ జర్నీలా కొనసాగుతూ వచ్చింది. పికప్ అందుకునేలోగా స్టేషన్ వచ్చినట్టు. కానీ విజయ్ దేవరకొండ జర్నీ అలా కాదు, ఆయన ఒక్కసారిగా రాకెట్ లా దూసుకుపోయాడు. ఆయన జర్నీ నాకు స్ఫూర్తి. అలాంటి ఆయనతో కలిసి త్వరలో ఒక సినిమా చేయాలనుంది” అని అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *