సందీప్ కిషన్ కి మైకేల్ మంచి పేరే తీసుకొస్తుందట!!

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరో గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సందీప్ కిషన్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రంజిత్ దర్శకత్వంలో మైకేల్ అనే ఓ పాన్ ఇండియా సినిమా ను దాదాపు గా ఈ హీరో పూర్తి చేశాడు. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ కథానాయికగా నటించింది. తాజాగా ఈ సినిమా యొక్క టీజర్ విడుదల అయ్యింది.

సందీప్ కిషన్ యాక్షన్ సినిమాలలో ఎక్కువగా నటించలేదు కాబట్టి ఈ సినిమా బాగుంటుందో లేదో అన్న అనుమానాలు కలిగాయి. కానీ సందీప్ కిషన్ తన యాక్షన్ తో ఎలాంటి అనుమానాలను కలిగించలేదనే చెప్పాలి. విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా తప్పకుండా తనకు మంచి విజయాన్ని తెచ్చి పెడుతుందని అందరు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *