మెగా 154 లో ఆ పాత్ర కీలకం కానుందట!!

మెగా స్టార్ చిరంజీవి 154 వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా యొక్క టీజర్ దీపావళి కి రాబోతు ఉండడం నిజంగా మెగా అభిమానులలో ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది అని చెప్పాలి. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ను సంక్రాంతి కి విడుదల చేయబోతుండగా శృతి హాసన్ కథానాయిక గా నటిస్తుంది. రవితేజ ఈ సినిమా లో ఓ కీలక పాత్ర లో నటిస్తుంది తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం రవితేజ వైజాగ్ రంగారావు అనే పాత్రతో కనిపించనున్నారుట.

అది ఔటెండ్ ఔట్ మాస్ పోలీస్ పాత్ర అని కొత్త ప్రచారం తెరపైకి వస్తుంది. పోలీస్ పాత్రలకు పెట్టింది పేరైనా రవితేజ ఈ సినిమాలోనూ అదిరిపోయే పాత్ర చేస్తున్నాడట. అయితే ఈ పోలీస్ పాత్రకు చిరు పాత్రకు సంబంధం ఏంటా అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. వీరయ్యకి సవతి సొదరుడి పాత్రలో మాస్ రాజా పోషిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. చిరంజీవి పాత్రకి పూర్తి కాంట్రాస్ట్ గా నెగిటివ్ రోల్ గా ఈ పాత్రని తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *