వి. రవిప్రకాష్‌ ABCPL (TV9) లో చిన్న వాటాదారుడు మాత్రమే….

ABCPL (TV9) తన అనుబంధ సంస్ధల విలీనానికి సంబందించి,  వాటా దారులందరి అనుమతి కోసం ఏర్పాటు చేసిన (EGM) కు సంబంధించిన నోటీసులు ఫిబ్రవరి 6 తేదీన వాటాదారులకు పంపాము.
ఈ సమావేశం మార్చి 2న జరగనుంది.

ABCPL మూలధనంలో అలందా మీడియా 97 శాతం అత్యధిక వాటా కలిగి ఉంది.వి. రవిప్రకాష్‌ ABCPL లో చిన్న వాటాదారుల్లో ఒకరు. రవిప్రకాష్‌కు వాటాదారునిగా విలీనానికి సంబంధించిన పత్రాలను పరిశీలించడానికి మాత్రమే అనుమతి ఇచ్చాం.

EGM అనేది ABCPL అకౌంట్స్‌ పరిశీలన కోసం కాదు. కాబట్టి, ఇక్కడ ఎలాంటి అకౌంట్ల తనిఖీ చేయడానికి అవకాశం లేదు. సోషల్‌ మీడియాలలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ వాస్తవాలను
ప్రజల ముందు ఉంచేందుకే చేస్తున్న ప్రకటన ఇది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *