రామ్ చరణ్ తర్వాత సుకుమార్ తోనా!!

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరో గా తెరకెక్కిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ తర్వాత వారి కాంబో లో సినిమా రావాల్సిందిగా అభిమానులు ఎంతో కోరుకున్నారు. ఆ విధంగా రామ్ చరణ్ తో సుకుమార్ ఇప్పుడు సినిమా చేస్తున్నాడు అందడం నిజంగా అయన అభిమానులను ఎంతో సంతోషపెడుతుందని చెప్పాలి.

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC15 చిత్రీకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. భారతీయుడు 2 తో పాటుగా ఆర్.సి15 ని సైమల్టేనియస్ గా శంకర్ పూర్తి చేస్తుండడం ఆసక్తికరం. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఎవరితో సినిమా చేస్తున్నాడో అన్న విషయం కొంత అయోమయంలో ఉన్న నేపథ్యంలో సుకుమార్ తో సినిమా చేస్తున్నాడు అన్న వార్త ఇప్పుడు వినిపిస్తుంది.

సుకుమార్ కూడా ఇప్పుడు పుష్ప రెండో భాగం సినిమా చేస్తున్న నేపథ్యంలో ఆ సినిమా తర్వాత వీరిద్దరూ సినిమా చేయడం గ్యారెంటీ అవుతుంది. ఇంకోవైపు సుకుమార్ విజయ్ దేవరకొండ తో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *