రాజమౌళి మహేష్ సినిమా.. ఇంట్రెస్టింగ్ రూమర్!!

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆఫ్రికా అడవుల్లో అత్యంత డేంజరస్ నేపథ్యంలో అడ్వెంచర్ మూవీ గా రాజమౌళి ఈ సినిమాను రూపొందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. రాజమౌళి అన్ని సినిమాలకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కు కూడా కథ అందిస్తుండడం విశేషం. ఈ సినిమా గురించి ఇప్పటికే ఎన్నో పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా మరో పుకారు అందరిలో ఎంతో ఆసక్తి ని కనపరుస్తుంది.

రాజమౌళి ఈ సినిమా లో కొన్ని సన్నివేశాల కోసం ఆఫ్రికా అడవుల్లో పచ్చి మాంసం తినే కొందరు మనషులతో ఫైట్ సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నాడట. ఆ అడవి మనుషులతో మహేష్ బాబు చేయబోతున్న యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్స్ టీమ్ ను రంగంలోకి దించే ఉద్దేశ్యంతో జక్కన్న ఉన్నాడట. ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియదు కానీ ఇది ఈ సినిమా పై మంచి పాజిటివ్ వైబ్స్ ను నింపుతుంది అని చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *