విజయ్ దేవరకొండ అతిధిగా ప్రిన్స్ ఆడియో లాంచ్!!

ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ అతిధి గా ప్రిన్స్ సినిమా ఆడియో లాంచ్ జరుగుతుంది. తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన ‘ప్రిన్స్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం JRC కన్వెన్షన్ సెంటర్ లో జరగబోతోంది. దీనికి టాలీవుడ్ హీరోలు విజయ్ దేవరకొండ మాత్రమే కాదు రానా దగ్గుబాటి తో పాటుగా డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిథిలుగా హాజరవుతున్నారు.

లైగర్ సినిమా పరాజయం తరువాత విజయ్ దేవరకొండ మొదటి సారిగా మీడియా ను పేస్ చేయబోతున్న విజయ్ దేవరకొండ ఏ విధమైన స్పీచ్ ఇస్తాడో అన్న ఆసక్తి అందరిలో ఉంది. ఆమధ్య సైమా అవార్డ్స్ కి హాజరయిన కూడా అది వేరే రాష్ట్రంలో జరగడంలో తెలుగు మీడియా, ప్రేక్షకులు ఆయనను చూడలేకపోయారు. ఇప్పుడు అయన ఏవిధంగా మాట్లాడి తన అభిమానుల అభిమానాన్ని గెల్చుకుంతాడో అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో ఉంది.

ఇక ప్రిన్స్ సినిమా కు అనుదీప్ దర్శకత్వం అందిస్తున్నాడు. తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. జాతి రత్నాలు సూపర్ హిట్ తర్వాత అనుదీప్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *