పవన్ కళ్యాణ్ ని నమ్ముకుంటే దూల తీరిపోతుందట!!

పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడానికి కొంతమంది నిర్మాతలు వెనుకడుగువేస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియా లో జరుగుతుంది. ఆయనతో సినిమాలు చేస్తే నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుందని, అసలు సినిమా ఉంటుందో లేదో అన్న అనుమానాలు కలుగుతున్నాయని చెబుతున్నారు. దానికి సాక్ష్యంగా పవన్ నటించాల్సిన సినిమాలు ఇంకా మొదలు కాకుండా ఉన్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం సమర్పణలో ఏ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ ని త్వరలోనే ప్రారంభిస్తామంటూ వర్క్ షాప్ ని కూడా చేశారు. ఇందులో పవన్ కల్యాణ్ కూడా పాల్గొనడంతో ఇక షూటింగ్ ఆగదని అంతా అనుకున్నారు. కట్ చేస్తే.. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కార్యకలాపాల్లో భాగంగా వైజాగ్ పర్యటనకు వెళ్లడం.. అక్కడ వైసీపీ నాయకులపై నిప్పలు చెరగడంతో ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ సినిమా షూటింగ్ లో అయన ఎప్పుడు పాల్గొంటారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *