మరో సినిమా విడుదల సిద్ధం చేసిన నిఖిల్

నిఖిల్ హీరో గా నటించిన కార్తికేయ సినిమా ఏ స్థాయి లో విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. బాలీవుడ్ లో సైతం ఈ సినిమా కి మంచి వసూళ్లు లభించాయి. చాలా రోజుల తర్వాత ఈ హీరో విజయాన్ని అందుకోగా ఆ తర్వాత చేసే సినిమాలు కూడా అదే స్థాయి లో ఉండే విధంగా రంగం సిద్ధం చేసుకున్నాడు నిఖిల్. అలా సుకుమార్ నిర్మాణంలో 18 పేజెస్ అనే సినిమా ను విడుదల కు సిద్ధం చేశాడు.

డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇది ఒక విభిన్నమైన ప్రేమకథ .. ఈ సినిమాలో నిఖిల్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ అలరించనుంది. గీతా ఆర్ట్స్ 2 – సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘కుమారి 21 F దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీసుందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఆయన బాణీలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *