వసూళ్ళలో దూసుకుపోతున్న కార్తీ సర్దార్ సినిమా!!

కార్తీ హీరో గా నటించిన సర్దార్ సినిమా ఇటీవలే దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు నుంచే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కు వసూళ్లు కూడా బాగానే వచ్చాయని చెప్పాలి. తమిళనాడుతో పాటు తెలుగు లో కూడా మంచి వసూళ్లు అందుకుంటున్న ఈ సినిమా తాజాగా మరో మైలురాయి కూడా అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల్లో 50 కోట్ల మార్కును టచ్ చేసింది. దగ్గరలో పోటీ ఇచ్చే సినిమాలేవీ లేకపోవడం వలన, ఈ సినిమా వసూళ్ల జోరు కొనసాగే అవకాశం ఉంది.

కార్తి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో, కథానాయికలుగా రాశి ఖన్నా – రజీషా విజయన్ కనిపిస్తారు. వాటర్ బాటిల్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా కి సీక్వెల్ కూడా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా అధికారిక ప్రకటన చేశారు.భవిష్యత్ తరాలవారు మంచినీళ్ల కోసం ఎంతగా ఇబ్బంది పడతారు అనే పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అన్ని రకాల ఎమోషన్స్ ఈ సినిమా లో చూపించి అందరిచే శభాష్ అనిపించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *