మరొక పార్ట్ మొదలైన మాస్ మూవీ షూటింగ్!!

సిద్ధార్థ్ జొన్నలగడ్డ హీరో గా రూపొందిన డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. మాస్ ప్రేక్షకులను, యూత్ ను ఈ సినిమా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా ఎండింగ్ లో రెండో భాగం సినిమా కి సీక్వెల్ ఉందని చెప్పగా అప్పటినుంచి ఆ సినిమా కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమా సీక్వెల్ కి టైటిల్ ను ఖరారు చేశారు.

‘టిల్లు స్క్వైర్’ అనే టైటిల్ ను ఖరారు చేసి, దీపావళి కానుకగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. అలాగే ప్రోమోను కూడా వదిలారు. ఈ కంటెంట్ ను రిలీజ్ చేసిన రెండు గంటలలోనే వన్ మిలియన్ వ్యూస్ లభించడం విశేషం. ఫస్టు పార్టులో నేహా శెట్టి కథానాయికగా నటించగా, సెకండ్ పార్టులో అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నట్టుగా ప్రకటించారు. మార్చి 2023లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *