త్వరలోనే శుభవార్త చెప్పబోతున్న దగ్గుబాటి రానా!!

టాలీవుడ్ లో చాలామంది హీరోలు పెళ్లి పీటలెక్కారు. 2020 లో ఏడాది ముదిరిపోతున్న చాలామంది హీరో లు పెళ్లి ళ్లు చేసుకుని సంసారం జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దగ్గుబాటి రానా పోయిన ఏడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మిహికా అనే అమ్మాయిని అయన పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే రెండో వివాహ వార్షికోత్సవం జరుపుకున్న ఈ జంట.. త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన లేదు కానీ రానా సన్నిహితులు ఈ వార్తను బయటకి చెబుతుండం విశేషం.

నిజానికి రానా – మిహికా తల్లిదండ్రులు కాబోతున్నట్లు చాలా కాలం క్రితమే వార్తలు వచ్చాయి. మిహికా తన భర్తతో కలిసి తీసుకున్న ఫోటోలలో ఆమె కొంత బొద్దుగా కనిపించడంతో అభిమానులకు ఈ సందేహం వచ్చింది. అయితే వాటిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడైనా ఇది బయటకు చెప్తారా అనేది చూడాలి. ఇక రానా సినిమా విషయాలకొస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని ఆసక్తి కరమైన ప్రాజెక్ట్ లలో నటించడానికి అయన సిద్ధమయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *