రాజమౌళి తో సినిమా… చిరంజీవి అలా అనేశాడేంటి!!

రాజమౌళి తో సినిమా చేయడానికి అందరు హీరోలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అలా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మహేష్ బాబు ఇప్పుడు ఆయనతో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అలాంటిది రాజమౌళి సినిమా చేసే విషయంలో చిరంజీవి కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్య పరిచింది. తాజాగా తన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ ప్రమోషన్ లో భాగంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు రాజమౌళి పై సెటైర్ వేస్తున్నట్లు మాట్లాడి అందరిని నవ్వించారు. రాజమౌళి గురించి పొగుడుతూనే ఈ విధంగా అయన చమత్కరించడం విశేషం.

రాజమౌళి అత్యంత ప్రతిభ కలిగిన దర్శకుడని..అన్నారు. బాహుబలి సినిమా తో అయన మన దేశ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి అని చిరంజీవి కొనియాడారు. ఆయనతో కొంత అనుభవం ఉంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజమౌళి చాలా లోతుగా చూస్తారని, ప్రతి ఒక్కటి ఎంతో పర్ ఫెక్ట్ గా రావాలని భావిస్తారని… ఆయన కోరుకునే ఔట్ పుట్ ను ఒక నటుడిగా తాను ఇవ్వగలనో, లేదో తనకు తెలియదని చెప్పారు.

అంతేకాదు మరోవైపు రాజమౌళి ఒక్కో సినిమాను ఏళ్ల తరబడి తెరకెక్కిస్తారని… ఒక్కో సినిమాకు మూడు నుంచి ఐదేళ్ల పాటు తీసుకుంటారని… అంత సమయాన్ని తాను ఇవ్వలేనని అన్నారు. దీంతో అక్కడివారందరు ఒక్కసారిగా నవ్వుకున్నారు. అయన తనయుడు రామ్ చరణ్ తో రాజమౌళి రెండు సినిమాలు చేశాడు. ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *