చివరిదశ చిత్రీకరణ జరుపుకుంటున్న భవాని వార్డు (1997) చిత్రం

తెలుగు లో సూపర్ నేచురల్ సినిమాలు రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఎప్పుడో కానీ ఇలాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావు. ఆ విధంగా ఇప్పుడు  జీ డీ నరసింహ దర్శకత్వంలో సూపర్ నేచురల్ సినిమా “భవాని వార్డు (1997) ” రూపొందుతుంది. గతంలో “నగం” అనే సినిమా చేసి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు అందుకున్న ఈ దర్శకుడు ఈ వినూత్నమైన చిత్రాన్ని చేస్తుండడం విశేషం. గాయత్రీ గుప్తా , జబర్దస్త్ అప్పారావు , మీసం సురేష్ , శివ పార్వతి , గణేష్ రెడ్డి , పూజా కేంద్రే , సాయి సతీష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ను విభు  ప్రొడక్షన్స్ బ్యానర్ పతాకంపై చంద్రకాంత మేగ్రోలియా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్  విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా యొక్క షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు చిత్ర యూనిట్ చెప్పింది. త్వరలోనే ఈ సినిమా యొక్క విడుదల తేదీని ప్రకటించనున్నారు.

నటీనటులు  : గాయత్రీ గుప్తా , జబర్దస్త్ అప్పారావు , మీసం సురేష్ , శివ పార్వతి , గణేష్ రెడ్డి , పూజా కేంద్రే , సాయి సతీష్ తదితరులు

సాంకేతిక వర్గం :

బ్యానర్ :  విభు  ప్రొడక్షన్స్
నిర్మాత : చంద్రకాంత మేగ్రోలియా
దర్శకుడు :  జీ డీ నరసింహ
పీఆర్వో : సాయి సతీష్ , రాంబాబు పర్వతనేని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *