అల్లు స్టూడియో డబ్బు సంపాదించడం కోసం కాదు – అల్లు అర్జున్!!

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇప్పుడు ఓ కొత్త స్టూడియో నిర్మితమైంది. అల్లు స్టూడియో పేరుమీద నిర్మితమైన ఈ స్టూడియో ఈ రోజు ప్రారంభమైంది. ప్రముఖ సినీ నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా నిర్మితమవగా ఈ కార్యక్రమాన్ని ల్లు రామలింగయ్య అల్లుడు, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా జరగడం విశేషం. ఈయర్జు ల్లు రామలింగయ్య పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. అదే సమయంలో ఆయన పేరుతో నిర్మించిన అల్లు స్టూడియోస్ ను ఈరోజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. డబ్బు సంపాదించడం కోసం ఈ స్టూడియో నిర్మించలేదన్నారు. స్టూడియోను నిర్మించాలనేది తాతగారి కోరిక అని… ఆయన జ్ఞాపకార్థం అల్లు స్టూడియోను నిర్మించామని తెలిపారు. తాతగారి 100వ పుట్టినరోజు తమకు చాలా ప్రత్యేకమైనదని చెప్పారు. ఈ స్టూడియోలో షూటింగ్ లు బాగా జరగాలని అన్నారు. ఈ స్టూడియో ద్వారా ఇండస్ట్రీకి మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *