చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఇప్పుడు పాట‌ల విడుద‌ల‌కు ముహుర్తం ఖ‌రారైంది. ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి సినిమా పాట‌లు ప్ర‌ముఖ ఆడియో కంపెనీ బీ4యు ఐకాన్ మ్యూజిక్ ద్వారా విడుద‌ల కాబోతున్నాయి. ఈ సినిమా పాట‌లు ప్ర‌తి ఒక్క‌రికి న‌చ్చుతాయ‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నాన‌ని ద‌ర్శ‌కుడు అక్ష‌ర తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆడియోకు మంచి ప్రోత్సాహంతో స‌హ‌కారం అందించిన‌ ఐకాన్ మ్యూజిక్‌కు సినిమా టీం కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *