రవితేజకు హీరోయిన్స్ ను రిపీట్ చేస్తాడనే పేరుంది. అలా చాలా మంది హీరోయిన్స్ కు రెండు మూడు సినిమాల్లోనూ అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేశాడు రవితేజ. అలా ఎంకరేజ్ చేయించుకున్న హీరోయిన్స్ లో రాశీ ఖన్నా కూడా ఉంది. ఆమె బెంగాల్ టైగర్ తర్వాత టచ్ చేసి చూడులో మెయిన్ హీరోయిన్ గా నటించింది. రాజా ది గ్రేట్ లో ఓ పాటలో మెరిసింది. ఇప్పుడు మరోసారి రవితేజ రాశీ ఖన్నాకు బ్రేక్ ఇవ్వబోతున్నాడట.

రవితేజ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఓ సినిమా చేస్తున్నాడు. దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా మొదలైంది. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇక రెండో లీడ్ హీరోయిన్ గా రాశీ ఖన్నాను తీసుకుంటున్నారట. రాశీ ఖన్నాకు రవితేజతో ఇది నాలుగో సినిమా కానుంది. ఈ హీరోయిన్ కు ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజ్ లేదు. అయినా రవితేజ ఆమెకు బ్రేక్ ఇస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *