ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్. ఈ సినిమాలో ఆమె పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతోంది. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ గోవాలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో జాన్వీ, ఎన్టీఆర్ కలిసి నటించే సీన్స్ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవరను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

జాన్వీ, ఎన్టీఆర్ కాంబో సీన్స్ చేయడం ఈ మూవీలో ఇదే తొలిసారి. దేవర లో జాన్వీ కపూర్ క్యారెక్టర్ గురించి ఓ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్స్ తో సాగుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ను జాన్వీ ఆకట్టుకునేలా చేస్తోందట. దీంతో ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనే ఇంట్రెస్ట్ ఏర్పడుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న దేవర ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *