హీరో విజయ్ దేవరకొండ కెరీర్ కు స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన సినిమా పెళ్లి చూపులు. ఈ సినిమా సక్సెస్ తో స్టార్ అయ్యారు విజయ్. పేరున్న దర్శక నిర్మాతలు ఆయనతో సినిమా చేసేందుకు ముందుకొచ్చారు. పెళ్లి చూపులు సినిమాను హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందించారు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఇలాంటి సక్సెస్ ను ఆయన మళ్లీ రిపీట్ చేయలేకపోయారు. త్వరలోనే పెళ్లి చూపులు కాంబో మరోసారి రిపీట్ కాబోతోంది.

తరుణ్ భాస్కర్ కొత్త సినిమా కీడా కోలా ప్రీ రిలీజ్ కు గెస్ట్ గా వచ్చిన హీరో విజయ్ దేవరకొండ..తరుణ్ భాస్కర్ తో త్వరలో సినిమా చేస్తున్నట్లు చెప్పాడు. తరుణ్ తన దగ్గరకు ఓ మంచి కథతో వచ్చాడని, ఈ కథతో సినిమా చేయాలనుకుంటున్నట్లు విజయ్ చెప్పాడు. దీంతో పెళ్లి చూపులు కాంబో మూవీపై క్లారిటీ వచ్చింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన కీడా కోలా వచ్చే ఫ్రైడే రిలీజ్ కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *