అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో మరో కొత్త సినిమా రాబోతోంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారికా హాసినీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న నాలుగో చిత్రమిది. అల వైకుంఠపురములో హిట్ తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకోన్ ను సంప్రదిస్తున్నారట. దీపికా ఓకే చెబితే టాలీవుడ్ లో ఆమెకు ఇది రెండో ప్రాజెక్ట్ కానుంది. ఇప్పటికే దీపికా…ప్రభాస్ కల్కి 2898ఏడీ సినిమాలో నటిస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ లో బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ కు క్యూ కడుతున్న నేపథ్యంలో దీపికా అల్లు అర్జున్ సినిమాకు ఓకే చెప్పడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *