హీరో మంచు విష్ణు తన కొత్త సినిమా భక్త కన్నప్ప కోసం పాన్ ఇండియా స్టార్స్ సెట్ చేసుకుంటున్నాడు. తెలుగులో ప్రభాస్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్, మలయాళం స్టార్ మోహన్ లాల్..ఇలా పెద్ద లిస్టే తయారు చేసుకుంటున్నాడు. ఈ కాస్టింగ్ తో పాన్ ఇండియా బిజినెస్ చేసుకోవచ్చని మంచు విష్ణు ప్లాన్ లో ఉన్నారు. ఈ క్రమంలో భక్త కన్నప్ప టీమ్ లోకి వచ్చేందుకు బాలీవుడ్ నుంచి ఓ స్టార్ హీరో ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.

బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ భక్త కన్నప్పలో కీలక పాత్ర చేసేందుకు ఒప్పుకున్నారట. అజయ్ తెలుగులో ఆర్ఆర్ఆర్ లో నటించారు. అజయ్ దేవగణ్ జాయిన్ అయితే హిందీ బెల్ట్ బిజినెస్ కవర్ చేయొచ్చని మేకర్స్ అనుకుంటున్నారు. ఇక భక్త కన్నప్ప షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. సెట్ లో ఓ యాక్షన్ సీన్ సందర్భంగా మంచు విష్ణుకు గాయాలయ్యాయని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. మంచు విష్ణుకు ఆయన నటించే ప్రతి సినిమాలోనూ గాయాలవడం రొటీన్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *