నాగార్జున హీరోగా నటిస్తున్న కొత్త సినిమా నా సామి రంగ. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అనౌన్స్ మెంట్ రోజే ప్రకటించారు. అయితే ఇంత త్వరగా సినిమాను ఎలా తెరపైకి తీసుకొస్తారని అంతా సందేహించారు. అయినా ఆ తర్వాతి ప్రకటనల్లోనూ ఈ సినిమాను సంక్రాంతి రిలీజ్ కే తీసుకొస్తామని వెల్లడించారు మేకర్స్.

అనౌన్స్ మెంట్ చేశారు గానీ గత కొద్ది రోజులుగా నా సామి రంగ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. సైలైంట్ గా షూటింగ్ చేస్తూ వెళ్తున్నారు. అసలు ఈ సినిమా ప్రస్తుతం ఏ స్టేజ్ మేకింగ్ లో ఉంది, ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అనే క్లారిటీ లేదు. దీంతో సంక్రాంతి రేసులో నాగార్జున సినిమా ఉంటుందా ఉండదా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ సినిమాలో అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో దర్శకుడు విజయ్ బిన్ని రూపొందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *