కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో స్టార్ హీరో సూర్య చేసిన రోలెక్స్ క్యారెక్టర్ ఆ సినిమా మొత్తానికి వన్ ఆఫ్ ది హైలైట్ అయ్యింది. క్లైమాక్స్ లో కొసమెరుపు అదిరిపోయేలా చేసింది. రోలెక్స్ చిన్న గెస్ట్ రోల్ అయినా సూర్య క్రేజ్ తో థియేటర్ లో ఆ క్యారెక్టర్ పేలింది. అయితే ఈ క్యారెక్టర్ చేసేందుకు మొదట సూర్య చాలా భయపడ్డారు, సందేహించారు. రోలెక్స్ తనకు బ్యాడ్ అవుతుందని అనుకున్నారు కానీ ఆయనకు ఇంత పేరు తెస్తుందని ఊహించలేదు.

రోలెక్స్ ఒక డ్రగ్ లీడర్ క్యారెక్టర్. సూర్యకు ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ కూడా మంచి పేరుంది. అగరం ఫౌండేషన్ తో సామాజిక కార్యక్రమాలతో మంచి మనసున్న హీరోగా అందరి అభిమానం పొందారు సూర్య. అలాంటి ఇమేజ్ ఉన్న తాను డ్రగ్ వ్యాపారి క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుందని సూర్య భయపడింది నిజమే. కానీ ప్రేక్షకులు సినిమాను సినిమాలా చూశారు. అందుకే రోలెక్స్ క్యారెక్టర్ ను అంతగా ఇష్టపడ్డారు. ఇప్పుడు సూర్య తనంతటే తానుగా రోలెక్స్ క్యారెక్టర్ తన కెరీర్ లో ఒక స్పెషల్ గా నిలిచిందని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *