కమల్ హాసన్ ఇండియన్ 2 నుంచి అప్ డేట్ వచ్చింది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి క్యారెక్టర్ ఇంట్రోను కమల్ హాసన్ బర్త్ డే అయిన నవంబర్ 3న ఇవ్వనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఇండియన్ 2 గురించి ఇప్పటిదాకా వచ్చిన అప్ డేట్స్ లో ఇదే మేజర్ అప్ డేట్ అనుకోవచ్చు. గతంలో సూపర్ హిట్టయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్2 తెరకెక్కుతోంది.

లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, నయనతార, ప్రియ భవానీ శంకర్, ఎస్ జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇండియన్ 2 కమల్ హాసన్ కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ కాబోతోంది. ఇండియన్ 2 ఇంట్రో అనౌన్స్ మెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అ‌వుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *