స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న హాలీడే మూడ్ లో ఉంది. ప్రస్తుతం ఆమె ఫారిన్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. తన హాలీడే టూర్ ఫొటోస్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఈ ఫొటోస్ కు నెటిజన్స్ బాగా రెస్పాండ్ అవుతున్నారు. రశ్మిక తన టూర్ ఫొటోస్ షేర్ చేస్తూ…ఇన్నాళ్లూ హాలీడేస్ ను మిస్ అయ్యానని చెప్పింది.

ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైమ్ తీసుకుని వెకేషన్ కు వెళ్లాలని, అలా వివిధ ప్రాంతాలు తిరిగినప్పుడు అక్కడి ఫుడ్, ప్రజల లైఫ్ స్టైల్, అక్కడి నేచర్ మిమ్మల్ని రీఫ్రెష్ చేస్తాయని రశ్మిక చెప్పింది. వెకేషన్ కు మీ సొంతూళ్లకు కూడా వెళ్లొచ్చని సలహా ఇచ్చింది. తాను ఇన్ని రోజులు టూర్ టైమ్ ను మిస్ అయ్యానని చెప్పుకుంది. రశ్మిక నటించిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆమె ఖాతాలో పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్ సహా మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *